ఏసీబీకి చిక్కిన ఆర్టిజన్ ఉద్యోగి

by Sumithra |   ( Updated:2020-12-15 04:57:07.0  )
ఏసీబీకి చిక్కిన ఆర్టిజన్ ఉద్యోగి
X

దిశ, కుత్బు ల్లాపూర్ : రూ.8వేలు లంచం తీసుకుంటుండగా జీడిమెట్ల సబ్ స్టేషన్ ఆర్టిజన్ ఉద్యోగి ఒకరు మంగళవారం ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. జీడిమెట్ల సబ్ స్టేషన్ పరిధిలో సుభాష్ నగర్ డివిజన్‌లోని భాగ్యనగర్ కాలనీలో స్తంబాల మార్పు, కొత్త మీటర్లు బిగించడానికి కాంట్రాక్టర్ వద్ద నుంచి తుకారం లంచం డిమాండ్ చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ లంచం అడగడంతో కాంట్రాక్టర్ శివ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం కాంట్రాక్టర్ నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటుంగా తుకారంను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Advertisement

Next Story