మసూద్ అజర్‌కు అరెస్టు వారెంట్

by Sumithra |
మసూద్ అజర్‌కు అరెస్టు వారెంట్
X

ఇస్లామాబాద్: నిషేధిత జైష్ ఏ మహమ్మద్ (జీఈఎం) చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్తాన్‌లోని ఓ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు అజర్‌పై పంజాబ్ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసుపై గురువారం విచారణ చేపట్టిన గుజ్రాన్‌వాలా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక కోర్టు (ఏటీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. అజర్‌ను అరెస్టు చేసి, కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సీటీడీని జడ్జి నటాషా నసీమ్ సుప్రా ఆదేశించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా, జిహాదీ సాహిత్యాన్ని జేఈఎం చీఫ్ విక్రయిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed