- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ముగ్గురు దొంగలు… అరెస్టు
దిశ, కంటోన్మెంట్: జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని కార్ఖాన సీఐ పరావస్తు మధుకర్ స్వామి తెలిపారు. మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ… కాకాగూడాకు చెందిన అర్జున్ బాల్యం నుంచే పక్కదారి పట్టి, దొంగతనాలు చేసి, జైలుకు కూడా వెళ్లాడని అన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు స్నేహితులతో కలిసి బైకుల చోరీకి పాల్పడ్డాడని, దీనికి సంబంధించి ఐదు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయన్నారు.
అంతేగాకుండా కార్ఖానలోని ఓ పాన్‌షాప్‌లో దొంగతనానికి పాల్పడిన విజువల్స్ సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయని, దీంతో ఎస్సై సందీప్‌రెడ్డి నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు బృందం వాహనాల తనిఖీలో భాగంగా ఒకే బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురుని విచారించారు. సరైన పత్రాలు లేకపోవటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన విచారణలో పాన్‌షాప్ దొంగతనంతో పాటు బైక్‌లు చోరీ చేసినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిపారు. దీంతో వీరి నుంచి ఐదు బైకులు స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు.