- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయమై గురువారం రాష్ట్ర విద్య శాఖా మంత్రి, జిల్లా కలెక్టర్లు, ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఈ సందర్భంగా ఆదేశించినట్లు చెప్పారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణ పై భాగస్వామ్యం ఉన్న అన్ని శాఖల అధికారులతో ఈ నెల 12 న సమావేశం నిర్వహించామని, కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, మాస్కు, శానిటేషన్ పక్కాగా నిర్వహించేలా తగు సూచనలు ఇచ్చామని, పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలను అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించినట్లు వెల్లడించారు. అదేవిధంగా విద్యుత్, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులందరూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించేందుకు ఉత్తర్వులు ఇచ్చామని ఆయన తెలిపారు. జిల్లాలో పరీక్షలను ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ వివరించారు.