కారుపై ఆర్మీ స్టిక్కర్.. పోలీసులు ఆపడంతో..!

by Shyam |
కారుపై ఆర్మీ స్టిక్కర్.. పోలీసులు ఆపడంతో..!
X

దిశ, కుత్బుల్లాపూర్ : లాక్‌డౌన్ లో రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఎవరైనా సరే నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం బోయిన్‌పల్లి నుంచి ఓ కారు అద్దంపై ఆర్మీతో పాటు డయాగ్నోస్టిక్స్ స్టిక్కర్ వేసుకుని కొంపల్లి వైపు వస్తున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఐ రాజు, ఎస్సై మల్సూర్ లు కారును ఆపి మీ ఐడీ కార్డు లేదా ఈ-పాస్ చూపించాలని కోరారు. దీంతో అందులో ఉన్న వారు ఎలాంటి పత్రాలు ఇవ్వకుండా తెల్లమొహాలేశారు. ఎవరైనా సరే చట్టాలకు అతీతులు కాదని కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు.

Advertisement

Next Story