- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయం కోసం సోనూసూద్‌కు లేఖ రాసిన ఆర్మీ అధికారి..
న్యూఢిల్లీ : కరోనా పోరులో స్వచ్ఛందంగా ముందుండి తన శాయశక్తుల ప్రజలకు సహకరిస్తు్న్న నటుడు, ‘రియల్ లైఫ్ హీరో’ సోనూసూద్‌కు కమాండింగ్ ఆర్మీ అధికారి హెల్ప్ కోసం ఓ లెటర్ రాశారు. ఈ లెటర్ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు కమాండింగ్ ఆఫీసర్‌పై చర్యలకు యోచిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మేర్ మిలిటరీ స్టేషన్‌లో 200 బెడ్‌ల సామర్థ్యంతో కొవిడ్ కేర్ సెంటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నామని, దానికోసం అవసరమైన కొన్ని ఎక్విప్‌మెంట్లను అందించాల్సిందిగా ఈ నెల 13వ తేదీతో ఓ లేఖ రాశారు.
నాలుగు ఐసీయూ బెడ్లు, పది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పది జంబో ఆక్సిజన్ సిలిండర్లు, ఒక ఎక్స్‌రే మెషిన్, రెండు 15 కేవీఏ జెనరేటర్లు సమకూర్చి తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సహాయాన్ని చేయాలని, తాము ఎప్పటికీ ఈ సహకారాన్ని విస్మరించబోమని పేర్కొన్నారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అసహనంతో ఉన్నట్టు సమాచారం. న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఓ సీనియర్ అధికారి ఈ లెటర్‌ను ధ్రువీకరించారు. కానీ, అందులో అతిశయం ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్మీ సొంత సామర్థ్యంతో ఎన్నో హాస్పిటళ్లను ఏర్పాటు చేసిందని, రాజస్తాన్‌లోనే 50 బెడ్ల హాస్పిటల్‌ను ఇటీవలే ఏర్పాటు చేశామని అన్నారు.