- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: జవాన్ మృతి
by Sumithra |
X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ అమరుడయ్యాడు. అలాగే, నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో దోడా జిల్లాలోని పోస్టాపొత్రా గ్రామంలో జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్ దళాలు సంయుక్తంగా శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమైయ్యాడు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మరో ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జమ్ము జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు.
Advertisement
Next Story