‘బండి సంజయ్’కు జీవన్ రెడ్డి సవాల్.. ‘దమ్ముంటే అది చేసి చూపించు’..

by Shyam |
‘బండి సంజయ్’కు జీవన్ రెడ్డి సవాల్.. ‘దమ్ముంటే అది చేసి చూపించు’..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంపీ బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని puc చైర్మన్ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో రూ. 65 వేల కోట్లు ఖర్చు చేసి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ వానాకాలంలో కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు తీసుకొచ్చి తెలంగాణలోని ధాన్యం కొనుగోలు చేసేలా బీజేపీ నేతలు కృషి చేయాలని సూచించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, అరవింద్‌లకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలంగాణ ప్రజలని, వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. యాత్రలు మాని రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.

తమ పార్టీనేతలు 14 అంశాలపై ఢిల్లీలో 10 రోజులు ఉండి కేంద్ర మంత్రులను కలిసి వినతులు అందజేశామన్నారు. ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుని బండి సంజయ్, రఘునందన్, కిషన్ రెడ్డిలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో రైతు సమస్యలపై మాట్లాడటం కాదని కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఢిల్లీకి పోయి రైతు సమస్యలపై పోరాడాలని సూచించారు. యాత్రలు తెలంగాణలో కాదని, ఢిల్లీలో చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. రేవంత్ హోల్‌సేల్ బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ‘ఉడ్తా పంజాబ్’సినిమా చూసి మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర బిగ్ ఫెయిల్యూర్ అయిందని జీవన్ రెడ్డి విమర్శించారు. వార్తల్లో వచ్చేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

Advertisement

Next Story