BCCI శ్రీలంకను అవమానించింది.. రణతుంగ సంచలన వ్యాఖ్యలు

by Shyam |
Arjuna-Ranatunga
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ త్వరలో ప్రారంభం కానున్న టీమిండియా పర్యటన నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ తమను తీవ్రంగా అవమానించిందని ఆయన అన్నారు. శ్రీలంక పర్యటనకు ఒక సెకెండ్ గ్రేడ్ జట్టును పంపించిందని.. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన శ్రీలంకకు ఇది పెద్ద అవమానమే అని ఆయన అన్నారు. బీసీసీఐ ఒక మామూలు జట్టును పంపించినా.. శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం ఏ మాత్రం వ్యతిరేకించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం టెలివిజన్ హక్కుల ద్వారా వచ్చే డబ్బుల కోసమే శ్రీలంక ఈ ప్రతిపాదనకు ఒప్పుకుందని రణతుంగ అన్నాడు. కాగా, భారత జట్టు శ్రీలంకలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది.

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రస్తుతం కొలంబోలో ఉన్నది. జట్టులో అంతర్జాతీయ వన్డేలు ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లు ఉన్నా రణతుంగ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన రాహుల్ ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించారు. ఆయనకు గతంలో ఇండియా ఏ, అండర్-19 జట్ల కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్నది. బీసీసీఐ ఇలా ఎంతో అనుభవం ఉన్నవారిని శ్రీలంక పంపినా రణతుంగ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed