పరిశోధకులకు మరో మమ్మీ లభ్యం.. ఎన్నాళ్ళ క్రితందంటే..

by Shyam |
mummy
X

దిశ, ఫీచర్స్ : పురాతన ఈజిప్టు మమ్మీల రహస్యాలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పరిశోధనల్లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మమ్మీల కోసం నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉండగా.. తాజాగా పెరూ సెంట్రల్ తీరంలో దాదాపు 800 ఏళ్ల వయసు గల మమ్మీని నిపుణుల బృందం కనుగొంది.

‘మమ్మీని లిమా ప్రాంతంలో కనుగొన్నాం. శరీరమంతా తాళ్లతో బంధించబడి, ముఖాన్ని చేతులతో కప్పి ఉంచారు. ఇది స్థానిక అంత్యక్రియల నమూనాలో భాగం కావచ్చు. సమాధి లోపల సిరామిక్స్, రాతి పనిముట్లు సహా కూరగాయల అవశేషాలు ఉన్నాయి. ఈ మమ్మీని దక్షిణ అమెరికాలోని తీర, పర్వత ప్రాంతాల సంస్కృతికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నాం. ఈ మమ్మీ.. మహిళనా లేక పురుషుడా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. మరిన్ని పరిశోధనల తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం. కచ్చితమైన కాలక్రమాన్ని గుర్తించేందుకు రేడియో కార్బన్ డేటింగ్ చేయాల్సి ఉంది’ అని శాన్ మార్కోస్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త పీటర్ వాన్ డాలెన్ లూనా తెలిపారు.

Advertisement

Next Story