బ్రాహ్మీ లిపి శాసనంతో కదిలిన పురావస్తు శాఖ!

by Shyam |
బ్రాహ్మీ లిపి శాసనంతో కదిలిన పురావస్తు శాఖ!
X

దిశ, న్యూస్ బ్యూరో: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెద గ్రామంలో 2200 ఏళ్ళ నాటి బ్రాహ్మీ శాసనం లభ్యమైంది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ఈ శాసనం లభించిన ప్రదేశాన్ని సందర్శించి సమగ్రమైన నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అక్కడ ఇంకా ఏమైనా రాతియుగపు ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలు ఉంటే వాటిని వెంటనే సేకరించి భద్రపరచాలని లిఖితపూర్వకంగా ఆదేశించారు.

అయితే, ‘హెరిటేజ్ తెలంగాణ’ (పురావస్తు శాఖ)కు, ‘బుద్ధవనం’కు చెందిన పురావస్తు నిపుణులు, కన్సల్టెంట్‌లు మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో అన్వేషణ చేశారు. ఇందులో భాగంగానే క్రీ.పూ 2వ శతాబ్దం నాటి ‘అశోక బ్రాహ్మీ లిపి’లో ప్రాకృత భాషలో 5 అక్షరాలున్న ‘మాధవ చంద’ అని ఓ వ్యక్తి పేరు రాసిన లఘు శాసనం లభ్యమైంది. ఇది తొలి శాతవాహనుల కాలం నాటిదని చరిత్ర కారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed