- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అకౌంట్ సెటిల్’ చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రతిపక్షాల అకౌంట్ సెటిల్ చేశారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలను క్షమిస్తామని చెబుతూనే ప్రతిపక్ష నేతల కామెంట్లకు దీటైన జవాబులిచ్చారు.
ఢిల్లీ సీఎం టెర్రరిస్టు అని ఓ నేత చేసిన వ్యాఖ్యలను ఎన్నికల క్యాంపెయిన్‌లోనే తనకు అనుకూలంగా మార్చుకున్న అరవింద్ కేజ్రీవాల్.. ఆ మాటతోనే తనను ఢిల్లీ వాసుల బిడ్డగా పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినవారు ఢిల్లీ బిడ్డ అరవింద్ కేజ్రీవాల్‌ను దీవించేందుకు వచ్చారని అన్నారు.
ఢిల్లీ సర్కారు ‘ఫ్రీ’లు ప్రకటిస్తున్నదని విమర్శించేవారి నోళ్లనూ మూయించారు. దేవుడు ప్రసాదించిన అమూల్యమైన ప్రతీది ఉచితమేనని అన్నారు. ప్రేమా వాత్సల్యం లాంటివి ఉచితమే ఉంటాయని చెబుతూ.. ఢిల్లీ వాసులను తాను ప్రేమిస్తున్నట్టే, ఢిల్లీవాసులూ తనను ప్రేమిస్తున్నారని తెలిపారు. అందుకే తమ సర్కారు ఉచితాలు ఇచ్చిందని వివరించారు. అలాగే, ఢిల్లీ అభివృద్ధికి ప్రధానమంత్రితో తాము సహకరిస్తామని తెలిపారు. ఢిల్లీ నిర్మాతలు ఢిల్లీ ప్రజలేనని అన్నారు. ఇది ఢిల్లీ విజయమని, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకైనా.. సీఎం తానేనని చెప్పారు.