కళాతపస్వి విశ్వనాథ్‌ను ఆరాధిస్తా : ఏఆర్ రెహమాన్

by Shyam |
AR Rahman, K Vishwanath
X

దిశ, సినిమా: ఆస్కార్డ్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్.. తెలుగు దర్శకుడు కళాతపస్వి కే విశ్వానాథ్ గారి పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సంగీత ప్రధాన చిత్రాల్లో స్క్రీన్‌ప్లే వర్క్‌కు తాను పెద్ద అభిమానినని వెల్లడించాడు. ఈ మేరకు మ్యూజీషియన్ల సోషల్ స్టేటస్‌తో పాటు తెరవెనుక వారు అనుభవించే స్ట్రగుల్స్ గురించి వివరించాల్సిన సినిమాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అసలు విషయానికొస్తే.. రెహమాన్ నిర్మాతగా ‘99 సాంగ్స్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతుంగా.. డెబ్యుడెంట్ హీరో ఇహన్ భట్‌తో కలిసి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు రెహమాన్. ఈ మ్యూజికల్ డ్రామాకు కథ కూడా అందించిన రెహమాన్.. పలువురు మ్యూజీషియన్ల రియల్ లైఫ్ స్టోరీ ఇన్‌స్పిరేషన్‌గా కథ రాసుకున్నట్టు తెలిపారు. వాస్తవానికి సంగీతానికి, సంగీత కళాకారులకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని అభిప్రాయపడ్డారు. ఇక ట్రైలింగువల్ ప్రాజెక్ట్‌(తెలుగు, తమిళ్, హిందీ)గా రూపొందిన ఈ సినిమాను విశ్వేష్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేయగా మనీషా కోయిరాల, లీసా రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

Next Story