అఫీషియల్: ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్

by Shyam |
AR Murugadas
X

దిశ, సినిమా: ‘గజిని’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సారి డైరెక్టర్‌‌గా కాకుండా, నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న మురుగదాస్.. ‘1947’ పేరుతో మూవీని ప్రకటించారు. ఓమ్ ప్రకాశ్ భట్‌తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కన్నడ దర్శకులు పోన్ కుమరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. కుమరన్ ఇంతకుముందు ‘విష్ణువర్ధన్’, ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ మూవీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించనున్నారు. ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా 2022 సమ్మర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మురుగదాస్ చివరగా దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. త్రిష ప్రధాన పాత్రలో నటించిన తన నెక్స్ట్ డైరెక్టోరియల్ ‘రాంగి’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed