- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంజీవని బస్సుల్లో.. కరోనా నిర్ధారణ పరీక్షలు
దిశ, ఏపీ బ్యూరో: ఇన్నాళ్లు లగ్జరీ బస్సులుగా సేవలందించిన ఇంద్ర బస్సులు రూపుమార్చుకన్నాయి. ఇంద్ర బస్సులు ఇప్పుడు సంజీవని బస్సులుగా మారాయి. ఇకపై ఈ సంజీవని బస్సుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రకటించారు. ఇప్పటి వరకు 21 ఇంద్ర బస్సులను సంజీవని బస్సులుగా మార్చామని వెల్లడించారు. వీటిని అన్ని జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. నిర్దేశించిన ప్రాంతంలో ఈ బస్సుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. మరో పది రోజుల్లో ఇంకో 30 సంజీవని బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు.
టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు నేడు హైదరాబాద్‌లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయని ఆయన తెలిపారు. సంచార రైతు బజారు కోసం, కార్గో సర్వీసుల కోసం ఆర్టీసీ బస్సులను తయారు చేశామని ఆయన వెల్లడించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీకి 4,200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడికి బస్సులు నడపలేకపోతున్నామని ఆయన చెప్పారు.