జనవరి 1 నుంచి పల్లె వెలుగు బస్సులు..

by srinivas |
జనవరి 1 నుంచి పల్లె వెలుగు బస్సులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పల్లె వెలుగు బస్సులు నడుపుతామని ప్రకటించింది. అందుకోసం తెలంగాణ ఆర్టీసీ అధికారులతో మరోసారి ఒప్పందం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఎండీ కృష్ణ బాబు తెలిపారు.

క్రాంతి పండుగకు 3,607 అదనపు బస్సులను నడుపాలని నిర్ణయించగా, టిక్కెట్టు చార్జీలు 50శాతం అదనంగా వసూలు చేస్తామన్నారు.అందులో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంప్లిమెంటరీ బస్‌పాస్ అందించునున్నట్లు ఎండీ స్పష్టంచేశారు. ఈ ఏడాది ఆర్టీసీ రూ.2,527 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఆ నష్టాన్ని పూడ్చడానికే అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఎండీ కృష్ణబాబు వెల్లడించారు.

Advertisement

Next Story