ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ షెడ్యూల్

by srinivas |   ( Updated:2020-03-14 01:30:06.0  )
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ షెడ్యూల్
X

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆన్‌లైన్ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆన్‌లైన్ పరీక్ష జరుగనుంది. 17న ఉదయం 9.30 గంటల నుంచి 11.10 గంటల వరకు జనరల్‌ ఇంగ్లీషు, జనరల్‌ తెలుగు పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షల్లో వేర్వేరుగా క్వాలిఫై కావాలని ఏపీపీఎస్సీ పేర్కొంది. అలాగే దాని కొనసాగింపుగా సాయంత్రం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. మరుసటి రోజు అంటే 18వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-2లో భాగంగా లెక్కలు (మ్యాథ్స్‌), అదే రోజు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-3లో భాగంగా జనరల్‌ ఫారెస్ట్రీ-1 పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం చివరి రోజైన 19వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-4లో భాగంగా జనరల్‌ ఫారెస్ట్రీ పరీక్షలు నిర్వహించనున్నారు.

tags : appsc, forest range officer, appsc exam, online exam, ap

Advertisement

Next Story

Most Viewed