- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా చూసేద్దాం
దిశ, వెబ్ డెస్క్ : మూడో దశ లాక్డౌన్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్నిటికీ మాత్రం మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం సినిమా హాళ్లను మాత్రం ఇప్పట్లో ఓపెన్ చేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాలు చూడటానికి.. టీవీ ఉన్నప్పటికీ చాలా మంది ఓటీటీ వేదికపై చూడటానికే మొగ్గు చూపుతున్నారు. సబ్ స్క్రిప్షిన్ లేకపోయినా కొన్నింటిలో మనం ఏ ఖర్చు లేకుండా ఉచితంగా సినిమా చూడొచ్చు.
లైవ్ నెట్ టీవీ :
ఇందులో దాదాపు 800 చానెల్స్ ను మనం చూడొచ్చు. అందులో స్పోర్ట్స్, కుకింగ్, కిడ్స్, రిలీజియన్, డాక్యుమెంటరీ, ఎంటర్ టైన్మెంట్, మూవీస్, న్యూస్, మ్యూజిక్ ఇలా తొమ్మిది విభాగాలకు చెందిన చానెల్స్ ఇందులో ఉన్నాయి. దీనికి సబ్ స్క్రిప్షిన్ అవసరం లేదు. అంతేకాదు భిన్న భాషలకు చెందిన ఎన్నో సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ను ఎనిమిది దేశాల్లో వినియోగిస్తున్నారు.
జియో సినిమా :
ఈ యాప్ ను ఉపయోగించాలంటే.. జియో నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో జియో టీవీ కూడా చూడొచ్చు. పాటలు వినొచ్చు. 15 భాషల్లోని సినిమాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒక వేళ జియో సిమ్ లేకపోయినా.. గూగుల్ క్రోమ్ లో జియో ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెబ్ సిరీస్ లు కూడా చూడొచ్చు. జియో కస్టమర్లకు జియో సినిమా ఉన్నట్లే.. ఎయిర్ టెల్ వినియోగదారులకు ఎయిర్ టెల్ టీవీ అందుబాటులో ఉంది. ఇందులో లైవ్ టీవీ తో పాటు, సినిమాలు చూసే వీలుంది.
యూట్యూబ్ :
దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూ ట్యూబులోనూ సినిమాలు ఉంటాయని మనందరకీ తెలుసు. కానీ కొత్త సినిమాలు చూడాలంటే మాత్రం ‘యూ ట్యూబ్ ప్రీమియం’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే యూ ట్యూబ్ ప్రీమియం మొదటి నెల మాత్రం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.
హాట్ స్టార్ :
ప్రస్తుతం ఈ ఓటీటీ వేదిక డిస్నీ సంస్థతో జతకట్టి సరికొత్తగా మన ముందుకు వచ్చింది. దాదాపు పది భాషల్లోని సినిమాలు ఇందులో మనం చూడొచ్చు. అయితే కొత్త సినిమాలు చూడాలంటే మాత్రం.. సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సీరియల్స్ చూడటానికి ఎక్కువ మంది హాట్ స్టార్ నే చూస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లతో పాటు, ఇతర క్రీడలను చూడటానికి హాట్ స్టార్ మంచి వేదిక.
థోప్ టీవీ :
లైవ్ క్రికెట్ మ్యాచ్ ను చూడాలంటే థోప్ టీవీ మంచి వేదికనే చెప్పాలి. బఫర్ కాకుండా మంచి క్వాలిటీతో క్రికెట్ ను ఆస్వాదించవచ్చు. దాదాపు ఎనిమిది దేశాల లైవ్ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్నో చానెల్స్ ను ఉచితంగానే చూడొచ్చు.
వూట్ :
ఇందులోనూ భారతీయ భాషలకు చెందిన సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కలర్స్ , ఎంటీవీ లకు చెందిన షో లు కూడా చూడొచ్చు.
జీ5, సోనీ లైవ్ లలో కూడా సినిమాలు చూసే వీలుంది. కొత్త సినిమాలు చూడాలంటే మాత్రం సబ్ స్క్రిప్షిన్ చేసుకోవాలి. ఇక అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీ వేదికల్లో కొత్త సినిమాలు వారం వారం అప్ డేట్ అవుతుంటాయి. కానీ వాటిలో చూడాలంటే తప్పక సబ్ స్క్రిప్షిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న ప్లాన్ ప్రకారం.. సింగిల్ లాగిన్ పై మల్టీ డివైజ్ యాక్సెస్ చేసుకోవచ్చు.
Tags : cinema, free, no subscrption, multiple languages, youtube , online movies