- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్రటేరియట్ నిర్మాణానికి రిటైర్డ్ ఎస్ఈ నియామకం
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న అధికారులను కాదని రోడ్లు భవనాల శాఖలో గతంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన సత్యనారాయణ అనే అధికారిని తీసుకొచ్చి సెక్రటేరియట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ఎస్ఈగా నియమించింది. ఈ అధికారి కోసం ఒక సంవత్సర కాలం పాటు ఆర్ అండ్ బీ పరిపాలన చీఫ్ ఇంజనీర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్) కార్యాలయంలో సూపర్ న్యూమరీ పోస్టును ప్రభుత్వం సృష్టించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ సంవత్సరం పాటు లేదా నిర్మాణం పూర్తయ్యేవరకు ఏది ముందుగా జరిగితే అంతవరకు విధులు నిర్వహించనున్నారని జీవోలో పేర్కొన్నారు.
Advertisement
Next Story