మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా నన్ను నియమించండి : హైకోర్టుకు ఊర్మిళ గజపతి

by srinivas |   ( Updated:2021-08-09 05:17:18.0  )
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా నన్ను నియమించండి : హైకోర్టుకు ఊర్మిళ గజపతి
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో త్రిముఖ పోరు నెలకొంది. మాన్సాస్ ట్రస్ట్‌పై ఇన్నాళ్లూ అశోక్‌గజపతిరాజు, సంచైత గజపతిరాజుల మధ్య ఆధిపత్యపోరు నడిచింది. అయితే కోర్టు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజునే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో సంచయిత గజపతిరాజు మౌనం దాల్చారు. తాజాగా వీరికి పోటీగా ఊర్మిళ గజపతి వచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తనను నియమించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఊర్మిళ ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె. మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఊర్మిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాన్సాస్ ట్రస్టుకు ఊర్మిళ వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed