కాంటాక్ట్ ట్రేసింగ్..కరోనా గుర్తింపు కోసం టెక్నాలజీ!

by  |
కాంటాక్ట్ ట్రేసింగ్..కరోనా గుర్తింపు కోసం టెక్నాలజీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ గతి మారుతోంది. మనిషి జీవత స్థితిగతులు కూడా మారనున్నాయి. తాజాగా కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఐటీ దిగ్గజ కంపెనీలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారాలను కనుగొంటున్నాయి. గూగూల్, యాపిల్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరాలను ప్రకటించాయి. కరోనా వైరస్ కట్టడికి గానూ ప్రభుత్వాలకు, ఆరోగ్య సంస్థలకు అవసరమయ్యేలా ‘కాంట్రాక్ట్ ట్రేసింగ్’ టెక్నాలజీని రూపొందించనున్నట్టు తెలిపాయి. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా కరోనా బాధితులు ఎవరెవరిని కలిశారో సులభంగా తెలుసుకునే సామర్థ్యం దీనికి ఉంటుందని సంస్థలు వెల్లడించాయి. కొవిడ్-19ని నివారించడంతో ‘కాంటాక్ట్ ట్రేసింగ్’ కీలకంగా పనిచేస్తున్నట్టు వైద్య ఆరోగ్య అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్, ఆపరేటింగ్ సిటమ్ లెవల్ సాంకేతిక అంశాల ఆధారంగా పనిచేస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీలోకి వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వైద్య ఆరోగ్య సంస్థలను, పలు యాప్‌లను చేరుస్తామని రెండు కంపెనీలు స్పష్టం చేశాయి. మే నెలలో ఆరోగ్య సంస్థల యాప్‌ల ద్వారా ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లతో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను విడుదల చేయనున్నట్టు గూగూల్, యాపిల్ సంస్థలు పేర్కొన్నాయి. మరికొద్ది నెలల్లో పూర్తీగా బ్లూటూత్ ఆధారంగా పనిచేసే కాంటాక్ట్ ట్రేసింగ్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశాయి. ఈ టెక్నాలజీతో కొవిడ్-19ను అరికట్టి ప్రజల సాధారణ జన జీవనాన్ని పునరుద్ధరిస్తామని, దాని కోసం కృషి చేస్తామని కపెనీలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యక్తుల, సంస్థల గోప్యతకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, పారదర్శకంగా దీన్ని రూపొందిస్తామని యాపిల్, గూగుల్ సంయుక్తంగా ప్రకటించాయి.

Tags: Coronavirus, Apple, Google, Contact-Tracing Technology, Contact-Tracing Technology COVID-19, API, Bluetooth Technology

Advertisement

Next Story

Most Viewed