- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోడ్డుతో మాకు ప్రమాదం.. అది మాకు వద్దే వద్దు..
దిశ, దుబ్బాక: అభివృద్ధి పనుల పేరుతో గ్రామాల్లోని పేద కుటుంబాలకు నష్టం చేస్తామంటే ఊరుకునేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామం మీదుగా సిద్దిపేటకు రింగు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. తమకు పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అప్పనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే ముందు మొర పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అప్పనపల్లి గ్రామం మీదుగా వెళ్లే రింగు రోడ్డును ఆపాలని బాధిత గ్రామస్తులు రఘునందన్ రావును కోరారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం అప్పనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా కాలువ కింద భూములు కోల్పోయిన వారికి పూర్తి నష్టపరిహారం అందలేదని మళ్లీ ఇప్పుడు సిద్దిపేటకు రింగు రోడ్డు పేరుతో అప్పనపల్లి గ్రామస్తులను నష్టం చేస్తామనడం సరికాదన్నారు. రింగు రోడ్డు నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తమ పరిధిలోని గ్రామస్తులకు మాత్రం నష్టం కలుగకుండా చూడాలని కోరారు. గ్రామంలో ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా, ఊరి భయట నుండి రింగు రోడ్డు నిర్మాణం చేసుకోవాలని సూచించారు.