అపోలో ఫార్మసీ ఉద్యోగుల కోసం 'మై గురుకుల్' డిజిటల్ కార్యక్రమం

by Harish |
అపోలో ఫార్మసీ ఉద్యోగుల కోసం మై గురుకుల్ డిజిటల్ కార్యక్రమం
X

దిశ, వెబ్‌డెస్క్: అపోలో ఫార్మసీ తన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ‘మై గురుకుల్’ పేరుతో ఈ వినూత్న లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అపోలో ఫార్మసీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వెబ్‌నార్ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ గ్రూప్ ఛైర్మన్ డా. ప్రతాప్ సి రెడ్డి కార్యక్రమాన్ని డిజిటల్‌గా ప్రారంభించారు.

అపోలో ఫార్మసీకి చెందిన 30 వేల మంది ఉద్యోగుల నైపుణ్యాలను, సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో రూపొందించినట్టు తెలిపారు. సమకాలీన డిజిట్ల శిక్షణ ద్వారా సులభంగా నేర్చుకునేందుకు ఉద్యోగులకు శిక్షణా మాడ్యూళ్లను అన్ని రకాల డిజిటల్ పరికరాల ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా అందే సౌలభ్యంతో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.

ఆ కార్యక్రమంపై స్పందించిన డా. ప్రతాప్ సి రెడ్డి…కొవిడ్-19ను ఎదుర్కోవడంలో అపోలో ఫార్మసీ ఉద్యోగులు ముందువరుసలో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 600 నగరాల్లో లాక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రతిరోజూ తమ రిటైల్ ఫార్మసీ స్టోర్లు తెరిచే ఉన్నాయని తెలిపారు. మెరుగైన సేవలను అందించడానికి అపోలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇప్పుడు సరికొత్త డిజిటల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ‘మై గురుకుల్’ తీసుకురావడం ద్వారా తమ ఉద్యోగులను మరింత నైపుణ్యం కలిగిన వారిగా తీర్చి దిద్దుతామన్నారు.

Advertisement

Next Story