- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి : మంత్రి అల్లోల
దిశ,నిర్మల్ కల్చరల్: ఏపీజే. అబ్దుల్ కలాం విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త అని, వారు మన దేశానికి క్షిపణి వ్యవస్థను అందించారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. శనివారం అబ్దుల్ కలాం 90వ జయంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, హాజరై అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని, కలాం గౌరవార్థం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గామ్ చౌరస్తా వద్ద ఆయన కాంస్య విగ్రహంతో పాటు మిస్సయిల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ సొసైటీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ షేఖ్ సాజీద్, సీడబ్ల్యూసీ సభ్యులు స్వదేశ్ పర్కిపండ్ల, పార్టీ నాయకులు డా. మల్లికార్జున్ రెడ్డి, రాము, రాంచందర్, సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్, సభ్యులు అబ్దుల్ జావీద్, షేఖ్ జాకీర్, మొహమ్మద్ రఫీ, అబ్దుల్ మాసూద్, సయ్యద్ ముజహిద్ అలీ, సదుల్ల హుస్సేన్, సయ్యద్ జాహిద్ హష్మీ, అబ్దుల్ అజీమ్, సయ్యద్ సల్మాన్, కౌన్సిల్లర్లు వేణు, షేఖ్ సయిద్, మతీన్, ఇమ్రాన్ ఉల్లా, ముజహిద్, మజీద్, రఫీ, మైనారిటీ నాయకులు వసీమ్ షకీల్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.