చేగువేరా ఇప్పుడెక్కడున్నారు : శైలజానాథ్

by srinivas |
చేగువేరా ఇప్పుడెక్కడున్నారు : శైలజానాథ్
X

చేగువేరా అనుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడున్నారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు. రాజధానిపై బీజేపీ నాటాకాలాడుతోందని, రాయలసీమలోఉండే రాజధానికి గతంలో త్యాగం చేశామని, మా రాజధానిని మాకు ఇవ్వమని అడుగుతున్నామని అన్నారు. బీజేపీకి వైసీపీ అతి విశ్వాసమైన కాపలాదారు అని శైలజానాథ్ విమర్శించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకమని మోడీకి చెప్పే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ర్ట ప్రయోజనాలు అనడం ప్రతిఒక్కరికీ అలవాటుగా మారిందన్నారు. మండలి రద్దు రాష్ర్ట ప్రయోజనం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసి అధ్యాయమని చెప్పినా కాళ్లు పట్టుకుంటున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed