నీకూ కూతురుందిగా : అపర్ణా నాయర్

by Jakkula Samataha |
నీకూ కూతురుందిగా : అపర్ణా నాయర్
X

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లు పెట్టిన పోస్ట్‌లకు అసభ్యకరమైన కామెంట్స్ కూడా వస్తుంటాయి. కొందరు వీటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు ఇలాంటి వాటికి అక్కడే ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మలయాళీ బ్యూటీ ‘అపర్ణా రాయర్’ ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టగా.. అజిత్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ లవ్ యూ’ అంటూ అసభ్యకరంగా రిప్లై ఇచ్చాడు. దీంతో తన ఎకౌంట్ డీటెయిల్స్ చూసిన అపర్ణ.. తగిన రీతిలో సమాధానమిచ్చింది. ‘అజిత్ కుమార్.. నేను మీ ఎకౌంట్‌లో మీ కూతురిని ప్రేమగా ఎత్తుకుని ఆలింగనం చేసుకున్న ఫోటోలు చూశాను. మరి నేను కూడా అంతే కదా.. నాకు అలాంటి తండ్రి ఉన్నాడు.. నేను ఒకరికి కూతుర్నే.. ఇలాంటి అసభ్యకర మెస్సేజ్‌లు ఎలా పెట్టగలిగారు’ అని ప్రశ్నించింది. అంతేకాదు అజిత్ కుమార్ ఫేస్‌బుక్ ఎకౌంట్ డీటెయిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాం తప్ప, ఇలాంటి చెత్త పోస్ట్‌ల కోసం కాదని తేల్చి చెప్పిన అపర్ణ.. ‘ఇలాంటి వాటికి రిప్లై ఇవ్వకపోతే మరింత మంది ఇదే పని చేసే అవకాశం ఉంది. కాబట్టే ఇలా స్పందించాల్సి వచ్చింది’ అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed