- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బందరు మహిళ.. నార్కట్‌పల్లిలో శవమైంది
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: గతనెలలో బందరులో అదృశ్యమైన మహిళ శనివారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన పల్లపోతు పద్మజ(45) సర్కిల్పేటలో నివాసం ఉంటూ ఓ రెస్టారెంటులో పనిచేస్తోంది. ఆగస్టు 31న విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో శనివారం నార్కట్‌పల్లి వద్ద ఓ మహిళ మృత దేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహం పద్మజ అనే మహిళదిగా గుర్తించి ఇనగుదురు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతోపాటు బంధువులు నార్కట్‌పల్లి చేరుకొని మృతదేహాన్ని మచిలీపట్నం తరలించారు. పద్మజను హత్య చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండు చేస్తున్నారు.
Advertisement
Next Story