విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

by Anukaran |   ( Updated:2021-03-04 07:41:14.0  )
kesineni swetha
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కుమారి కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. కేశినేని శ్వేత మేయర్ అభ్యర్థి అంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. మేయర్ అభ్యర్థిగా ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే అధిష్టానం చివరకు కేశినేని శ్వేత వైపే మొగ్గు చూపింది. ఇకపోతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 11వ డివిజన్‌ నుంచి కేశినేని శ్వేత బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన డివిజన్‌తో పాటు.. ఇతర డివిజన్లలో టీడీపీ, మిత్ర పక్షాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవలే మేయర్ అభ్యర్థిపై టీడీపీలో విబేధాలు బట్టబయలయ్యాయి. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసింది. దీంతో బెజవాడ టీడీపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story