- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేమొస్తే మీకు పుట్టగతులు ఉండవు: టీడీపీ నేతకు పోలీస్ హెచ్చరిక
ఖాకీ బట్టలు విడిచి తాము రాజకీయాల్లోకి వస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి పుట్టగతులు ఉండవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత హెచ్చరించారు. విశాఖపట్టణంలో ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో విశేష అనుభవముందని చెప్పుకునే అయ్యన్నకు రాజకీయాలు చేతకాకపోతే ఇంట్లో మూల కూర్చోవాలని సూచించారు. పోలీసులకు ఎవరిపైనా ప్రేమ ఉండదని, చట్టప్రకారం విధులు నిర్వర్తిస్తామని ఆమె చెప్పారు. అయ్యన్న రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని, ఉనికి చాటుకునేందుకు ఆయన పోలీసులపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థ ఒకరి కింద పని చేసేది కాదని, ప్రజల రక్షణకు పని చేసేదని ఆమె తెలిపారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ పోలీసు వ్యవస్థ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుందని అన్నారు. పోలీసు వ్యవస్థపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయనను హెచ్చరించారు.
tags : swarnalata, ap state police association vice president, ayyannapatrudu, tdp