- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ విధి: ఎస్ఈసీ
X
దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ విధి అని ఏపీ ఎస్ఈసీ తెలిపింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఫేస్‌షీల్డ్‌లు, మాస్క్‌లు,శానిటైజర్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది.
ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని పేర్కొంది. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటి లేరని కొనియాడింది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వ్యాక్సినేషన్‌లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు చెప్పింది.
Advertisement
Next Story