- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. వారికి మరో అవకాశం
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో పలు కారణాల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించారు. మంగళవారం మధ్యాహ్నాం వరకు నామినేషన్లు దాఖలు చేయోచ్చని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు ఎస్ఈసీ అవకాశం కల్పించారు. బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వార్డుల్లో ఎవరైతే నామినేషన్ దాఖలు చేయలేక..ఫిర్యాదు చేశారో వారంతా మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసి అనుమతి పొందిన వారు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.