- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్ పాక్షిక ఎత్తివేత పోలీసులకు సవాలే..!
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి లాక్‌డౌన్ పాక్షిక ఎత్తివేత పోలీసులకు సవాల్ విసరనుంది. లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న రోజుల్లోనే పోలీసులకు ప్రజలు సవాల్ విసిరారు. 144 సెక్షన్ అమలులోకి తెచ్చినా ప్రజలు రోడ్ల మీదకి రావడం మానలేదు. సాక్షాత్తూ పోలీసులే ప్రజలు నియంత్రణ పాటించడం లేదని వాపోయారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. అలాంటిది లాక్‌డౌన్ పాక్షిక ఎత్తివేతను పూర్తి ఎత్తివేతగా మలచేందుకు ప్రజలు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు సెంచరీ దాటేశాయి. కృష్ణా, నెల్లూరు జిల్లాలు సెంచరీ దిశగా సాగిపోతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాలన్నీ కరోనా ప్రభావానికి గురైన జిల్లాలే. పదు సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇప్పటికీ అనుమానితులను వైద్యఆరోగ్య శాఖాధికారులు క్వారంటైన్ గృహాలకు తరలిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సఫలమైతే బలయ్యేది పోలీసులేనని పలువురు పేర్కొటున్నారు.
రెడ్ జోన్లలో ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. రోజు రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి ఒక్కరు పాక్షిక లాక్‌డౌన్‌లో బయటకు తిరిగినా.. రాష్ట్రం మొత్తం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పలు కారణాలు చెబుతూ బయటకు వచ్చే ప్రజలను ఎలా అడ్డుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా కంట్రోల్‌లోకి వచ్చే వరకు లాక్‌డౌన్ కొనసాగించి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
tags: andhra pradesh, ap police, lockdown, security