రద్దీ తగ్గలేదు కానీ,.. వెయ్యి మందికే అనుమతి

by srinivas |
రద్దీ తగ్గలేదు కానీ,.. వెయ్యి మందికే అనుమతి
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటరయ్యే సరిహద్దు చెక్ పోస్టుల వద్ద మూడో రోజు కూడా రద్దీ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదులోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. దీంతో గత నెల 24 నుంచి 26 మధ్య రోజుకి 800 మందికి అనుమతిచ్చిన అధికారులు, ఇప్పుడు రోజుకు వెయ్యి మందికి పైగా అనుమతి ఇస్తున్నారు. దీంతో సరిహద్దుల వద్ద రద్దీ నెలకొంది. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ‘స్పందన’, ‘ఈ-పాస్’, ‘ఆధార్’, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతే అధికారులు అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం చేతిపై ‘హోం క్వారంటైన్’ముద్ర వేస్తున్నారు. అనుమతి పత్రాలు లేని వారిని వెనక్కి పంపుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే వీరిని అనుమతిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.

Advertisement

Next Story