గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్

by srinivas |
గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా కాజ సచివాలయాన్ని ఎంపికచేశారు. తొలుత ఇక్కడ అమలు చేసి ఆ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. గత కొద్ది రోజులుగా సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయాలనే అంశంపై ఇటు రిజిస్ట్రేషన్‌, అటు ప్రభుత్వవర్గాల్లో అయోమయం నెలకొంది. తాజాగా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దస్తావేజుకు సంబంధించిన చెక్‌స్లిప్‌లు కొట్టడానికి, మార్కెట్‌ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించే పనులకు మాత్రం సచివాలయాల్లోని ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన నెట్‌వర్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Advertisement

Next Story