- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఫ్రీగా ఇస్తాం : మంత్రి బొత్స సత్యనారాయణ
దిశ, ఏపీ బ్యూరో: ఆగస్టు నెలలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బుధవారం టిడ్కో, మెప్మా, బ్యాంకు సమన్వయకర్తలతో మంత్రి బొత్స టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.92 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
టిడ్కో ఇళ్లల్లో మౌళిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. టిడ్కో ఇళ్ల పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే విషయంలో బ్యాంకు అధికారులు సహకరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.