- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘20 కోట్ల పెట్టుబడులతో అంఫినాల్‌తో ఎంవోయూ’
దిశ ఏపీ బ్యూరో: కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ – ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (ఏఎంటీజెడ్) మధ్య జరిగిన ఎంవోయూ కుదిరిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో ఆంఫినాల్ ఏపీలో ప్రవేశిస్తుందని అన్నారు. ఈ ఒప్పందంతో వందలాది మంది శాస్త్రవేత్తలు, మెడికల్, ఫార్మా, ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంఫినాల్ సంస్థకి వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవముందని ఆయన చెప్పారు.
మనిషి శరీరంలో భౌతిక మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణ వాయువైన ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను కొలిచి, నిర్ధారించే పరికరాల రూపకల్పనలో ఈ సంస్థకు విశేషమైన పేరు ప్రఖ్యాతులున్నాయని ఆయన చెప్పారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు చాలా అవసరమని ఆయన చెప్పారు. గత 4 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శుభ్రత, మంచి అలవాట్లపై ప్రజలకు శ్రద్ధ, వైద్యరంగం, ఫార్మా, పరిశోధనలపై గౌరవం పెరిగిందని అన్నారు.