- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు మోసాలు తెలిస్తే జనాలు బాదుతారు: పేర్ని నాని
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం విజయవాడకు వచ్చిన చంద్రబాబు తనను ఓడించిన ప్రజలపై అక్కసుతో శాపనార్థాలు పెట్టాడు. తాను ఓట్లు అడగడానికి రాలేదంటూ, అధికారం తనకు అవసరం లేదంటూ ఆత్మవంచన చేసుకుంటూ మాట్లాడారని ధ్వజమెత్తారు. నిద్రపోతున్న విజయవాడ ప్రజలను మెలుకొలిపేందుకే తాను వచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఆయన మతిస్థిమితం సక్రమంగా లేదనేందుకు నిదర్శనమన్నారు.
తాను అధికారంలో వున్న ఐదేళ్ళలో బెజవాడలో కేంద్రం మంజూరు చేసిన ఒక్క ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు? ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విజయవాడకు కనీసం బైపాస్ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనే చేయని వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు విజయవాడ ప్రజలపై కపట ప్రేమ చూపించేందుకు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజారంజకంగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఎబిసిడి అంటూ చంద్రబాబు పేర్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీకి కేరాఫ్. చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి రెండెకరాల పొలం ఇస్తే మరి వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా ఆర్జించాడో చంద్రబాబు ప్రజలకు వివరించాలి.
భారతదేశంలో పాలు, పెరుగు, పిడకలు అమ్ముకుని మీలాగా ఎవరూ ఇన్ని వేల కోట్లు సంపాదించ లేదు. ప్రభుత్వంలో ఉంటూ.. పాపాలు చేస్తూ.. ప్రజల సొమ్మును దోచుకుంటూ.. హెరిటేజ్ పేరుతో తప్పుడు లెక్కలు రాయడం వల్లే ఇన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించడం వాస్తవం కాదా..? అని నిలదీశారు. హెరిటేజ్ మీ పాపాల పుట్ట. అక్కడ తాండవించేది పాలు, పెరుగు కంపు కాదు.. అవినీతి కంపు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. అమరావతి రాజధాని పేరుతో వేలాది ఎకరాలు అమాయకులైన రైతులను బెదిరించి, మాయమాటలు చెప్పి లాక్కున్ని మీ బినామీలకు కట్టబెట్టారని విరుచుకుపడ్డారు. గుంటూరు, విజయవాడలను నాశనం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని విజయవాడలో ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు.
అమరావతి కోసం ఇంటికి ఒకరు చొప్పున వస్తే.. నువ్వు చేసిన మోసాలు తెలుసుకుని నిన్ను బాదుతారు. అమరావతిలో అసలు మీరేం చేశారని స్థానికులు ప్రశ్నిస్తే, జగన్ ని ప్రశ్నించాలని ఎలా అంటారని ప్రశ్నించారు. అమరావతి వీధుల్లోకి వస్తే చంద్రబాబుపై జనం తిరగబడే పరిస్థితి వస్తుంది. విజయవాడలో నీ నాయకులను నువ్వు పక్కన పెట్టుకుని వస్తే.. మీ కార్యక్రమాలకు మేం రామూ అని మీ కార్యకర్తలే అంటున్నారు. ఇదీ నీ దుస్థితి. దుర్గ గుడి కొండ మీద కొబ్బరి చిప్పలు, సైకిల్ బెల్లు డిప్పలు అమ్ముకున్న వారిని పక్కన పెట్టుకుని పర్యటన చేయాల్సిన దీనస్థితిలో చంద్రబాబు ఉన్నారంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
దుర్గు గుడిలో అమ్మ వారి వద్ద క్షుద్రపూజలు చేస్తే, అమ్మవారు నిన్ను క్షమిస్తుందా చంద్రబాబూ? నీలాంటి వారిని వదిలేస్తుందా..? అమ్మవారు మహిమ గల తల్లి కాబట్టే, అమరావతి పేరుతో ఈ ప్రాంత ప్రజలను దోచుకుని, సర్వనాశనం చేశావు కాబట్టే నీకు ఈ శాస్తి చేసింది. ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. స్వచ్చమైన రాజకీయాలు చేయాలి. అమరావతిలో మీరేం చేశారు? దేశమంతా తిరిగి చెంబెడు మట్టి, గ్లాసెడు నీరు పోగేశారు. అంతా షో చేశారు. తాత్కాలిక భవనాలు నిర్మిస్తే.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. రూ.3 వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన భవనాలు ఎంత దారుణంగా ఉన్నాయో, మీ అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ మంత్రులను రౌడీలంటు్న చంద్రబాబే నిజమైన ముసలి రౌడీ అంటూ పేర్ని నాని విరుచుకుపడ్డారు. మంత్రులను రౌడీలంటున్న చంద్రబాబు నిజమైన ముసలి రౌడీ, ఈ దేశంలో రాజకీయనాయకుడిగా ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తివి. నీ హయాంలో ఎన్ని హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేశావో ప్రజలకు తెలుసునన్నారు.