ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రమోషన్

by srinivas |
ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రమోషన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి పేర్ని నానికి కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పేర్ని నానికి అప్పగించారు. పేర్ని నాని ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వద్ద ఉంచుకున్నారు. కానీ ఆ శాఖను గత కొన్ని రోజులుగా మంత్రి పేర్ని నాని పర్యవేక్షిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు విషయంలో గానీ.. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం, థియేటర్లలో టికెట్ల ధరలు తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రి పేర్ని నాని కీలక పాత్ర పోషించారు.

ఈ విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పేర్ని నాని భేటీ కావడం.. సంప్రదింపులు జరపడం తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చనిపోయినా ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నానినే సీఎం వైఎస్ జగన్ పంపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖను పేర్ని నానికే అప్పగిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story