పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనువైన ప్రాంతం – గవర్నర్

by srinivas |   ( Updated:2021-09-04 04:54:09.0  )
governer-hari-chandan
X

దిశ, ఏపీ బ్యూరో : ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని వివరించారు.

ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరి చందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story