డాక్టర్ సుధాకర్, పంచాయతీ రంగులపై హైకోర్టులో విచారణ

by srinivas |
డాక్టర్ సుధాకర్, పంచాయతీ రంగులపై హైకోర్టులో విచారణ
X

వైద్యుడు సుధాకర్‌‌ను విశాఖ పోలీసులు నడిరోడ్డు మీదే అదుపులోకి తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, మానసిక చికిత్సాలయంలో చేర్చినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో సుధాకర్‌ ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేసి, రేపు సాయంత్రంలోగా హైకోర్టుకు సమర్పించాలని విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనతరం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

ఇక, ఏపీలో గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగుల అంశంపై విచారణ సందర్భంగా… పంచాయతీ భవనాలకు ఇప్పటికీ పార్టీ రంగులను పోలినవే వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పార్టీ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. భవనాలకు ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

Advertisement

Next Story

Most Viewed