- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు అసహనం..
దిశ, ఏపీ ప్రభుత్వం: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కేవలం 25 కేసుల్లో చెల్లింపులు చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 25 కేసుల్లో కూడా అత్యధికం సర్పంచ్ అకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్‌కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అలాంటి వారి వివరాలు ఇవ్వాలని…వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.
అలాగే కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించగా..విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా అని నిలదీసింది. రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అలాగే 20 నుంచి 30 శాతం చెల్లింపులను కట్ చేయడంపై కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 15 వరకు ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటిషనర్, ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు హైకోర్టు వాయిదా వేసింది.