- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసును సీబీఐకి అప్పగించండి: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు వ్యక్తుల నిర్బంధంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ కేసులో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు పోలీస్‌లు ఎన్.ఆదినారాయణ, ఆర్.శ్రీనివాసరావు, టీ.శ్రీనివాసరావులను 14 అక్టోబర్ 2019లో అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో వారిని కోర్టులో కూడా హాజరుపరిచారు. అనంతరం వారి వాగ్మూలాలను కూడా రికార్డు చేశారు.
అనంతరం వారు ముగ్గురూ కనిపించకుండా పోయారు. దీంతో తమ భర్తలు కనిపించడం లేదని, పోలీసులే వారిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ వారి భార్యలు సునీత, నాగలక్ష్మి, విజయలక్ష్మిలు గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాము గుంటూరులోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అర్బన్ ఎస్‌పికి వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఈ పిటిషన్‌లో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు అర్బన్ ఎస్‌పి, గుంటూరు సిసిఎస్ డిఎస్‌పిలను ప్రతివాదులుగా చేస్తూ, సిసిఎస్ సిఐ వెంకటరావుపై ఆరోపణలతో వ్యక్తిగత హొదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు.
అంతేకాకుండా అరెస్టు సమయంలో తమ భర్తలు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా పిటిషన్‌కు జత చేశారు. దీంతో ఆ ముగ్గురి ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన హైకోర్టు, గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జితో విచారణకు ఆదేశించింది. అనంతరం ఆయన సమర్పించిన నివేదికను పరిశీలించి, విచారించింది. జడ్జి రిపోర్టులోని అంశాలను పోలీసులు వ్యతిరేకించడంతో సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది.