- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు
దిశ, ఏపీ బ్యూరో: జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు అంశంపై మీడియాతో మాట్లాడవద్దని తెలిపింది. ఈ మేరకు జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. జడ్జి రామకృష్ణలో కరోనా లక్షణాలు కనిపించటంతో బి. కొత్తకోట నుంచి మదనపల్లె వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి వెళుతుండగా మార్గ మధ్యలోఅడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలు షరతులతో కూడా బెయిల్‌ను ఏపీ హైకోర్టు దాదాపు రెండు నెలలకు బెయిల్ మంజూరు చేసింది.