ఏపీ గ్రూప్ -1 అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్.. హైకోర్టు తీర్పు రిజర్వు!

by srinivas |
ap-highcourt 1
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 అభ్యర్థుల పరీక్షల కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది. మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ సంస్థ చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థతో జరిపించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును ప్రస్తుతం రిజర్వులో పెట్టింది. ఇదిలాఉండగా, 2019 మే నెల 26న ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ముగిసాక వెలువడిన ఫలితాలపై నాటి నుంచి అభ్యర్థులు అసహనం వ్యక్తచేశారు. అంతేకాకుండా ప్రిలిమ్స్ పరీక్షలో 120 ప్రశ్నల్లో సుమారు 51 తప్పుగా వచ్చాయి. పేపర్ కౌంటింగ్ జరిపిన వారు తప్పులను పరిగణలోకి తీసుకోకుండా అలానే కరెక్షన్ చేయడంపై కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ ఇప్పటికే జరగగా తాజాగా కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అయితే, మరోసారి పరీక్షలు నిర్వహించాలని లేదా తప్పుగా ప్రచురితమైన ప్రశ్నలను తొలగించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story