ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

by Anukaran |   ( Updated:2021-02-27 05:28:18.0  )
cm jagan
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 21 మంది డిప్యూటీ కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ దేవాలయాల్లో ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఎంవీ సూర్యకళను ప్రభుత్వం నియమించింది. ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా జీవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జేసీగా బాపిరెడ్డి, ప్రకాశం జేసీగా కె.కృష్ణవేణి, ఏపీ ఎన్నార్టీ సొపైటీ సీఈవోగా కె. దినేష్ కుమార్ ను మచిలిపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కె. ఆదయ్యను నియమించింది.

Advertisement

Next Story