ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by srinivas |
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతుల్లో ఉన్న గ్రామాల్లోని వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీధి దీపాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా, ప్రజలు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 200 కరెంటు స్తంభాలుండగా వాలంటీర్ల సాయంతో ఎనర్జీ అసిస్టెంట్‌ వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story