ప్రైవేటు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు

by srinivas |
ప్రైవేటు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు
X

ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్కరణలకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు ఏపీ విద్యాశాఖ ఉపక్రమించింది. 130 ప్రైవేటు పాఠశాలల్లో విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పాఠశాలలు వసూలు చేసే ఫీజులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధించేవారి అర్హత వివరాలను పరిశీలించారు. గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని వివిధ స్కూళ్లతో పాటు, విజయనగరం జిల్లాలోని 24 పాఠశాలలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, ఫీజు వివరాలపై అధికారులు ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాతో సరిపెడతామన్న అధికారులు ఇవే తప్పులు పదేపదే చేస్తే మాత్రం లైసెన్స్‌లు రద్దు చేస్తామని అన్నారు.

Advertisement

Next Story