- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో నూతన మార్గదర్శకాలు.. మీకు తెలుసా?
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రం పలు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగించిన నేపథ్యంలో వాటికి అనుగుణంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సైతం లాక్‌డౌన్‌ను అదే తేదీ వరకు పొడిగిస్తూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 8నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల్లో దేవాలయాలు పునఃప్రారంభిస్తుండడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుస్తుండడంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను శనివారం విడుదల చేసింది.
వీటిలో కీలకమైనవి పరిశీలిస్తే..
* కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమల్లో ఉంటాయి.
* రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకోవచ్చు.
* కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవచ్చు. (హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ తీసుకెళ్లేందుకే అధిక ప్రాధాన్యత)
* షాపింగ్ మాల్స్‌లో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
* షాపింగ్ మాల్స్‌లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
* గేమింగ్ ప్రాంతాలు (షాపింగ్ మాల్స్‌లో, బయట) తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మూసి ఉంచాలి.
* ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
* హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి.
* డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈ-వాలెట్ సౌకర్యం కల్పించాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
* 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి.
* కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు అన్ని ప్రాంతాల్లో విధిగా పాటించాలి.
దేవాలయాల్లో పాటించాల్సిన నిబంధనలు
ఏ మతానికి చెందిన దేవాలయమైనా తెరుచుకోవచ్చు. అయితే, ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు చేసుకోవాలి. తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం నిషేధం. అన్నదానం నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి. ఆలయాల్లో క్యూ లైన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి.