ఏపీలో మద్యంపై పన్ను రేట్లు సవరణ

by srinivas |   ( Updated:2021-11-10 06:13:23.0  )
ap
X

దిశ, ఏపీ బ్యూరో: మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌లో మార్పు చేస్తూ అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేసింది. అలాగే దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేర్పులు చేసింది. బ్రాండ్‌ల వారీగా పన్నుల్లో చేసిన సవరణలను పరిశీలిస్తే రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించింది.

రూ.400-2,500 మద్యం కేస్‌కు 60 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేస్‌కు 55 శాతం, రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేస్‌పై 50 శాతం, రూ.5 వేలు, ఆపై మద్యం కేస్‌పై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశీయ తయారీ బీర్‌ కేస్‌పై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం, రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేస్‌పై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. మరోవైపు అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed