బడ్జెట్ సమావేశాలపై తేల్చుకోలేకపోతున్న జగన్ సర్కార్

by Anukaran |
ap assembly speaker tammineni sitaram
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. సమావేశాలు నిర్వహించాలా వద్దా అని తెలియక తలలు పట్టుకుంటుంది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై క్లారిటీ రాకపోవడంతో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి విచారణ ఓ కొలక్కి రాలేదు. ఇప్పటికే విచారణ జరుగుతూనే ఉంది. మార్చి 8కి రీ నోటిఫికేషన్ కి సంబంధించిన అంశంపై తుది తీర్పు వెలువడనుంది.

దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం అసాధ్యమైతే ఆర్డినెన్స్ పెట్టడమా..? ఓటాన్‌ అకౌంట్‌కు వెళ్లడమా..? అనే అంశాలపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. లేని పక్షంలో తక్కువ రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతుంది. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయ తీసుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed